అధ్యాత్మ సంకీర్తన
రేకు: 365-4
సంపుటము: 4-384
రేకు: 365-4
సంపుటము: 4-384
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| ఇదియే సాధన మిహపరములకును పదిలము మాపాలి పరమవు నామం | ॥పల్లవి॥ |
| కలి దోష హరము కైవల్యకరము అలరిన మా శ్రీ హరి నామం సులభము సౌఖ్యము శోభన తిలకము పలుమారును శ్రీ పతి నామం | ॥ఇది॥ |
| పాప నాశనము బంధ విమోక్షము పైపై నిది భూపతి నామం స్థాపితధన మిది సర్వరక్షకము దాఁపి రమిది మాధవ నామం | ॥ఇది॥ |
| నేమము దీమము నిత్యకర్మమిది దోమటి గోవిందుని నామం హేమము శరణము యిన్నిట మాకును యే మేర శ్రీ వేంకటేశ్వరు నామం | ॥ఇది॥ |


