Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 365-5
సంపుటము: 4-385
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
నమ్మిన దిదివో నా పితురార్జిత
మిమ్మహిఁ జూడరో యిది మీది గాదు
॥పల్లవి॥
నలినదళాక్షుని నామాంకితమే
నిలువున బాఁతిన నిధానము
కలకాలమిదే గాదెల కొలుచులు
నలుగడ నివియే నాలుక రుచులు
॥నమ్మి॥
శ్రీ పతి రూపమే చింతించు తలఁపే
పై పై మాయింటి భాగ్యములు
పూఁపలమిత్రులుఁబుత్రాదు లిది
వైపగు మాకిదె వ్యవసాయములు
॥నమ్మి॥
శ్రీ వేంకటపతి సేవిది యొకటే
భావించు నాయుష్యభౌష్యములు
కైవల్యపద మిదె కాయజసుఖమిదె
సావధానముల సంసార మిది
॥నమ్మి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము