Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-6
సంపుటము: 1-200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
సామాన్యమా పూర్వసంగ్రహంబగు ఫలము
నేమమున బెనగొనియె నేఁడు నీవనక
॥సామాన్య॥
జగతిఁ బ్రాణులకెల్ల సంసారబంధంబు
తగుల బంధించు దురితంపుఁ గర్మమున
మగుడ మారుకుమారు మగువ నీవురముపై
తెగి కట్టి రెవ్వరో దేవుండవనక
॥సామాన్య॥
పనిలేక జీవులను భవసాగరంబులో
మునుఁగ లేవఁగఁ జేయు మోహదోషమున
పనిపూని జలధిలోఁ బండఁబెట్టిరి నిన్ను
వెనకెవ్వరో మొదలివేలుపనక
॥సామాన్య॥
వుండనియ్యక జీవనోపాయమున మమ్ము
కొండలను గొబల తతిగొని తిప్పుఫలము
కొండలను నెలకొన్న కోనేటిపతివనఁగ
నుండవలసెను నీకు నోపలేననక
॥సామాన్య॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము