అధ్యాత్మ సంకీర్తన
రేకు: 366-1
సంపుటము: 4-387
రేకు: 366-1
సంపుటము: 4-387
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| అతఁడే యెక్కుడు దైవ మందరికంటే తతినింకాఁ జెప్పిచూప దైవాలు గలవా | ॥పల్లవి॥ |
| జలధి దచ్చేనాఁడు సకల దేవత లుండ యెలమి నేదేవుఁ జేరె నిందిరాదేవి అల గజేంద్రుఁడు మూలమని మొరవెట్టునాఁడు వెలయ నే దేవుఁడు విచ్చేసి కాచెను | ॥అతఁ॥ |
| పుడమి గొలుచునాఁడు పొడవైన దేవతలు కెడసి యెవ్వ రడుగు కింద దాఁగిరి కడలేని జగములు గల్పించే బ్రహ్మదేవుఁ - డడరి యే దేవు నాభియందుఁ బుట్టెను | ॥అతఁ॥ |
| యెంచి నాఁడు దేవతల నింద్రియాల జొక్కించే - పంచబాణుఁ డేదేవునిపట్టి, యిపుడు కొంచక శ్రీ వేంకటాద్రిఁ గోరిన వరము లిచ్చి అంచల లోకములేలీ నండ నే దేవుఁడు | ॥అతఁ॥ |


