అధ్యాత్మ సంకీర్తన
రేకు: 366-2
సంపుటము: 4-388
రేకు: 366-2
సంపుటము: 4-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు | ॥పల్లవి॥ |
| పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు | ॥నారా॥ |
| పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది | ॥నారా॥ |
| కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ - యందె పరమపద మవల మరేది | ॥నారా॥ |


