అధ్యాత్మ సంకీర్తన
రేకు: 366-4
సంపుటము: 4-390
రేకు: 366-4
సంపుటము: 4-390
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఒకరి బుద్ధులు వేరొకరి పనికి రావు అకలంకుఁ డింతటికి నంతర్యామి | ॥పల్లవి॥ |
| పొడమించు నాతఁడే పొదలించు నాతఁడే నొడిగించు నాతఁడే నోరఁగొలఁది గడియించు నాతఁడే కడలేని సిరులెల్ల అడియాలమగులోని యంతర్యామి | ॥ఒకరి॥ |
| మతి యిచ్చు నాతఁడే మరపించు నాతఁడే గతియౌ నాతఁడే కరుణానిధి వెతమాన్పు నాతఁడే వెలయించు నాతఁడే అతిశయమగులోని యంతర్యామి | ॥ఒకరి॥ |
| యిహమిచ్చు నాతఁడే యెదురెదురనే వచ్చి సహజపుఁ బరమిచ్చు సరి నాతఁడే విహగ గమనుఁడు శ్రీ వేంకటేశుఁ డితఁడే అహరహమాదరించు నంతర్యామి | ॥ఒకరి॥ |


