అధ్యాత్మ సంకీర్తన
రేకు: 366-6
సంపుటము: 4-392
రేకు: 366-6
సంపుటము: 4-392
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఒలపక్షము లేనొక్క దేవుఁడవు నలినాక్ష హరీ నమో నమో | ॥పల్లవి॥ |
| నేరిచిన నే నేరకుండిన నీ కారుణ్య మొక్కటే కలది పారి ఘంటాకర్ణుభ క్తికి సరిగా చేరి శుకాదులఁ జేకొంటిగాన | ॥ఒల॥ |
| సాదనైన నేఁ జలమతినైనా నీ పాదమొక్కటేఁ నే బట్టినది పాదైన వసిష్ఠు భక్తికి సరిగా మేదిని వాల్మీకి మెచ్చితి గాన | ॥ఒల॥ |
| యేమిటా శ్రీ వేంకటేశ యెంతైన నీ నామమొక్కటే నే నమ్మినది సామజము భక్తి సరిగా నీవును ప్రేమతోఁ బ్రహ్లాదుఁ బెంచితిగాన | ॥ఒల॥ |


