అధ్యాత్మ సంకీర్తన
రేకు: 368-3
సంపుటము: 4-401
రేకు: 368-3
సంపుటము: 4-401
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| హరి నీకే శరణని గెలుచుట గాక యిరవుగ నెరఁగఁగ నెవ్వరి తరము | ॥పల్లవి॥ |
| తను వికారములు తరవులు వెట్టిన కొనయెరుకైనా కొరతవడు మనసు వికారము మమతలఁ దగిలిన యెనసి యెదురుపడ నెవ్వరి తరము | ॥హరి॥ |
| కంతు వికారము కన్నులఁగప్పిన పంతపు విరతియు బయలౌను చింతాలహరులు చీఁదర రేఁగిన యింతయు వీడ్కొన వెవ్వరితరము | ॥హరి॥ |
| అతిగుణవికార మాసలఁ బెట్టిన సతతయోగములు జడనుపడు మతి శ్రీ వేంకటపతి నిన్నుఁ గొలిచిన యితరము దగ్గర నెవ్వరితరము | ॥హరి॥ |


