అధ్యాత్మ సంకీర్తన
రేకు: 369-1
సంపుటము: 4-404
రేకు: 369-1
సంపుటము: 4-404
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఎఱఁగఁడు పరసుఖ మీశ్వర నీ మాయ నెఱి విచారముల నెగడిన దాఁక | ॥పల్లవి॥ |
| అతిహేయములో నడరు వరాహము అతిహేయము సుఖమని తలఁచు మతి సంసారంబే మరగిన యాతుమ పతిలేని దిదే పరమని తెలియు | ॥ఎఱగ॥ |
| పొరి విషయములోనఁ బొడమిన కీటము అరిది విషమ తీపని తినును పరగ యోని సంభవమగు దేహాతుమ పెరిగి యందుకే ప్రియపడును | ॥ఎఱగ॥ |
| యింతేసి నిన్నియు నెరఁగిన యీయాతుమ అంతరాత్మ నీవని తలఁచి యింతట శ్రీ వేంకటేశ్వర నిన్నే రంతుల శరణనె రక్షించవే | ॥ఎఱగ॥ |


