అధ్యాత్మ సంకీర్తన
రేకు: 371-1
సంపుటము: 4-416
రేకు: 371-1
సంపుటము: 4-416
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ తడతాఁకుల తాపత్రయము మానుపుటకు | ॥పల్లవి॥ |
| శరణు శరణు వోసర్వేశ్వర నీకు మరణభయములెల్ల మానుపుటకొఱకు మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ దురితములిన్నియుఁ దొలఁగించుటకు | ॥అడియు॥ |
| దండము దండము నీకు దైవశిఖామణి పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి నిండు నీకరుణ నాపై నించేటి కొరకు | ॥అడియ॥ |
| అభయ మభయము శ్రీయాదినారాయణ వుభయకర్మము నాకు నూడుచుట కొరకు విభుఁడ శ్రీ వేంకటేశ వినుతి సేసెద నిన్ను శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు | ॥అడియ॥ |


