అధ్యాత్మ సంకీర్తన
రేకు: 372-2
సంపుటము: 4-423
రేకు: 372-2
సంపుటము: 4-423
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇన్నివిధాలు యిఁకనేల ప్ర - పన్నుఁడై మీఁద బహువిధులేలా | ॥పల్లవి॥ |
| సతతభూతదయ సత్యవాక్యము గలితే కుతిలపు ధర్మాలగొడవలేలా ప్రతిలేనివిజ్ఞానభావశుద్ధి గలిగితే మతకపుఁ గర్మాలు మరియేలా | ॥ఇన్ని॥ |
| పొందుగ నిన్నిటను సమబుద్ధి నిలిచితేను సందడిలోఁ దీర్థాచరణలేలా నిందమాని యాసమాని నిర్మలచిత్తులయితే వందడైన వుపవాస వ్రతము లేలా | ॥ఇన్ని॥ |
| శ్రీ వేంకటపతి చింతనము గలిగితే పావనపు శాస్త్రాల పఠనలేలా ఆవల నీతని దాసులందుఁ బ్రేమ గలిగితే కావరపుటితర సంగతులేలా | ॥ఇన్ని॥ |


