అధ్యాత్మ సంకీర్తన
రేకు: 373-4
సంపుటము: 4-431
రేకు: 373-4
సంపుటము: 4-431
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తోడి
| స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే - నతికమై యాడినట్లు ఆడఁబోయేవా | ॥పల్లవి॥ |
| యెంత నీ మనసును యెట్టుండె నట్లనే అంతయుఁ జేయవయ్య మాకదే చాలు అంతకంటే నెక్కుడు నేమంటిమివో యటమీఁదఁ జెంతల మా చెప్పినట్టు సేయఁబోయేవా | ॥స్వతం॥ |
| కమ్మి నీవు మునుప సంకల్పించినట్లనే కిమ్ముల నా రీతిఁ జిత్తగించవయ్య అమ్మరో నేమందుకుఁ గాదనినను నీవు సమ్మతించి మాతలఁపు సాగనిచ్చేవా | ॥స్వతం॥ |
| పొంచీదేహమున మమ్ముఁ బుట్టించినట్లనే పెంచి నీపై భక్తిమాకుఁ బెనచవయ్య నించిన శ్రీవేంకటేశ నేనే పదరితిఁగాక మంచితనములు నీవు మానఁబోయేవా | ॥స్వతం॥ |


