అధ్యాత్మ సంకీర్తన
రేకు: 374-2
సంపుటము: 4-433
రేకు: 374-2
సంపుటము: 4-433
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| కూడుదు రూరకె వొకచో గుమి విత్తురు వేరొకచో యేడకొ తెరువులు నడతురు యేఁటిదో హరిమాయ | ॥పల్లవి॥ |
| కొందరు జీవులు పురుషులు కొందరు కాంతలు కొందరు గొందరు నానాకువలయజంతువులు యిందరుఁగూడుక భువిలో నేమోయేమో చేసెద - రెందును నేమియుఁ గానరు యిట్టిది హరిమాయ | ॥కూడు॥ |
| జననంబులు మరణంబులు జమునుదయాస్త మయంబులు జనులివిగనుచునె కనకము సరినార్జింపుదురు పొనుగుచు నిలిచినదేదో పోయినదేదో కానము యెనగొని వెరగయ్యీనిదె యిట్టిది హరిమాయ | ॥కూడు॥ |
| జీవులకీ బ్రహ్మాండము చీమలపుట్ట విధంబున కావరమిటు గప్పున్నది కాలత్రయములను తావుల శ్రీవేంకటపతి దాసులు చొరకిటు నవ్వఁగ యీవల నావలఁ బొదిగీ నిట్టిది హరిమాయ | ॥కూడ॥ |


