అధ్యాత్మ సంకీర్తన
రేకు: 374-3
సంపుటము: 4-434
రేకు: 374-3
సంపుటము: 4-434
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శోకవరాళి
| నడవరో జడియక నవ్యమార్గ మిది మడుఁగిది వైష్ణవమార్గ మిది | ॥పల్లవి॥ |
| ఘనశుకముఖ్యులు గన్న మార్గ మిది జనకాదులు నిశ్చలమార్గ మిది సనత్కుమాఁరుడుజరపుమార్గ మిది మనువుల వైష్ణవమార్గ మిది | ॥నడవ॥ |
| నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది యిల వేదవ్యాసుల మార్గం బిది బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము మలసిన వైష్ణవ మార్గ మిది | ॥నడవ॥ |
| పరమమార్గం బిదె ప్రపంచమార్గము గురుమార్గం బిదె గోప్య మిదే గరిమెల శ్రీ వేంకటపతి మాకును మరిపెను వైష్ణవమార్గ మిదే | ॥నడవ॥ |


