అధ్యాత్మ సంకీర్తన
రేకు: 375-5
సంపుటము: 4-441
రేకు: 375-5
సంపుటము: 4-441
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశి
| హరి నీవే సర్వాత్మకుఁడవు యిరవగు భావన యియ్యఁగదే | ॥పల్లవి॥ |
| చూడక మానవు చూచేటి కన్నులు యేడనేవైనా యితరములు నీడల నింతా నీ రూపములని యీడువడని తెలి వియ్యఁగదే | ॥హరి॥ |
| పారక మానదు పాపపు మన సిది యీరసములతో నెందైనా నీరజాక్ష యిది నీమయమేయని యీరీతుల తలఁ పియ్యఁ గదే | ॥హరి॥ |
| కలుగక మానవు కాయపు సుఖములు యిల లోపలఁ గల వెన్నైనా అలరిన శ్రీ వేంకటాధిప నీకే యిలనర్పితమను యిహ మియ్యఁగదే | ॥హరి॥ |


