అధ్యాత్మ సంకీర్తన
రేకు: 377-5
సంపుటము: 4-451
రేకు: 377-5
సంపుటము: 4-451
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| వలసిన వారికి వై పులివి చలమున మానుటే జయమర్మం | ॥పల్లవి॥ |
| తనలోనే పో దైవము ఘనమే యణువై కనినది కనవలె నీతనిఁ గనుటకు మనసు లయమౌటే మర్మం | ॥వలసి॥ |
| భావములోనే పరమము తావై తలఁపే తగిలినది కైవశమై యిది గలుగుటకు కేవల శాంతం కృతమర్మం | ॥వలసి॥ |
| హృదయములోనే యింతాను తుదిపదమై మదిఁ దోఁచీని యెదుటనే శ్రీవేంకటేశ్వరుని కదిసి భుజించుటే ఘనమర్మం | ॥వలసి॥ |


