అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-1
సంపుటము: 4-453
రేకు: 378-1
సంపుటము: 4-453
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పట్టిన వ్రతము నీవే పరిపాలింతువు గాక బట్టి బయలింతే నేను బలిమున్నదా | ॥పల్లవి॥ |
| దేవ నీవు మనసు సోదించఁగా నే ధీరుఁడనై ఆవలఁ జలించకుండే యంతవాఁడనా పూవు వంటి చిత్త మింతే పొల్లువంటికాయ మింతే భావించ నిందులఁ బస వున్నదా | ॥పట్టిన॥ |
| అంతరాత్మవై నీవు యటు మరఁగులుసేయ- నంతనె నినుఁ దెలిసే యంతవాఁడనా గంతివంటిగుణ మింతే గాలివంటిప్రాణ మింతే యింతరట్టుసేయ నిందు నెడమున్నదా | ॥పట్టిన॥ |
| మచ్చిక శ్రీ వేంకటేశ మాట నీవై యుండఁగాను అచ్చపు నిన్ను నుతించే యంతవాఁడనా గచ్చువంటియిహ మింతే గనివంటి పర మింతే ముచ్చట కిందుకుఁ దుద మొద లున్నదా | ॥పట్టిన॥ |


