అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-2
సంపుటము: 4-454
రేకు: 378-2
సంపుటము: 4-454
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| నరసింహ రామకృష్ణ నమో శ్రీ వేంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే | ॥పల్లవి॥ |
| బావ తిట్లకు శిశుపాలునిఁ జంపిన- యేవ కోపకాఁడవు నేఁ డెందు వోతివి నీవాఁడనని నన్ను నిందించి శత్రువును చావఁగొట్టి వానినిట్టే సంహరించవే | ॥నర॥ |
| దాసుని భంగించేటి తరిఁ గస్యఁపుఁ జంపిన యీసు కోపకాఁడ విపు డెందువోతివి మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే సాసించి శత్రువును సంహరింపవే | ॥నర॥ |
| కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్దఁజంపిన యెల్లగాఁగఁ గోపకాఁడ వెందువోతివి యిల్లిదె శ్రీ వేంకటేశ యీ నీ మీఁదిపాటలు జల్లన దూషించు శత్రువు సంహరింపవే | ॥నర॥ |


