అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-3
సంపుటము: 4-455
రేకు: 378-3
సంపుటము: 4-455
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఎరిఁగీ నెరఁగదు యేమి సేతు మతి హరిదాస్యం బదియే సుఖము | ॥పల్లవి॥ |
| వెతలఁబొరలే ఘన విభవముకంటే అతి పేదరిక మది సుఖము గతి నెరవుల సింగారము కంటెను సత మగు తన నిచ్చలమే సుఖము | ॥ఎరిగీ॥ |
| పలుబాములఁబడు పగలిటికంటే తెలిసి నిద్రించు రాతిరి సుఖము అలమట గడించు నమృతముకంటే కలపాటి తనకు గంజే సుఖము | ॥ఎరిగీ॥ |
| పరపీడలొసఁగు భవమునకంటే ధరఁ బొడమని చందము సుఖము గరిమల శ్రీ వేంకటపతి నీకే శరణని యెడి నాజన్మమే సుఖము | ॥ఎరిగీ॥ |


