అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-4
సంపుటము: 4-456
రేకు: 378-4
సంపుటము: 4-456
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పుట్టఁగా బుట్టిన నా భోగపుటాస పట్టి యేమి గట్టుకొంటి బదుకవో యాసా | ॥పల్లవి॥ |
| వూరు దిప్పినట్టి యాస వుగముదిప్పిన యాస చేరవచ్చి దైన్యమందించిన యాస భారపెట్టి దేహమెల్లా బడిలించిన యాస పారి మమ్మేఁచితి వింత బదుకవో యాసా | ॥పుట్ట॥ |
| నాలుక రుచుల యాస నాతులకాఁకల యాస కాలకాసుకైన బొంకు గరుపే యాస వోలిఁ బుణ్య తపమెల్ల వొరులకమ్మించు నాస పాలుమాలించితి వింక బదుకవో యాసా | ॥పుట్ట॥ |
| కిందుపరచేటి యాస గేలిసేయించేటి యాస పొందియట్టే సంతసానఁ బొదిపే యాస కందువ శ్రీ వేంకటేశుఁ గని శరణంటి నేను పందతనమొల్ల నింక బదుకవో యాసా | ॥పుట్ట॥ |


