అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-5
సంపుటము: 4-457
రేకు: 378-5
సంపుటము: 4-457
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఆ రూపమునకే హరి నేను మొక్కెదను చేరి విభీషణుని శరణాగతుఁడని చేకొని సరిఁ గాచితివి | ॥పల్లవి॥ |
| ఫాలలోచనుఁడు బ్రహ్మయు నింద్రుఁడు సోలి నగ్నియును సూర్యచంద్రులును నీలో నుండఁగ నెరిఁ గనెఁ గిరీటి మూల భూతి వగు మూర్తివి గాన | ॥అరూ॥ |
| అనంత శిరసుల ననంత పదముల- ననంత నయనము లనంత కరముల ఘన నీ రూపము గనుఁగొనెఁ గిరీటి అనంత మూరితి వన్నిటఁ గాన | ॥అరూ॥ |
| జగము లిన్నియును సకల మున్నీంద్రులు - నగు శ్రీ వేంకటనాథుఁడ నిన్నే పొగడఁగఁ గిరీటి పొడగనె నీ రూపు అగణిత మహిముఁడ వన్నిటఁగాన | ॥ఆరూ॥ |


