అధ్యాత్మ సంకీర్తన
రేకు: 378-6
సంపుటము: 4-458
రేకు: 378-6
సంపుటము: 4-458
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఆంజనేయ యనిలజ హనుమంత నీ - రంజకపుఁ జేఁతలు సురల కెంచ వసమా | ॥పల్లవి॥ |
| తేరిమీఁద నీ రూపు దెచ్చిపెట్టి యర్జునుఁడు కౌరవుల గెలిచె నంగర భూమిని సారెకు భీముఁడు పురుషామృగముఁ దెచ్చుచోట నీరోమములు గావా నిఖిల కారణము | ॥ఆంజ॥ |
| నీమూలమునఁగాదె నెలవై సుగ్రీవుఁడు రామునిఁ గొలిచి కపిరాజాయను రాముఁడు నీవంకనే పో రమణి సీతాదేవిఁ బ్రేమముతో మగుడను బెండ్లాడెను | ॥ఆంజ॥ |
| బలుదైత్యులను దుంచ బంటతనము మించ కలకాలమును నెంచఁగలిగితిగా అల శ్రీ వేంకటపతి యండనే మంగాఁబుధి - నిలయపు హనుమంత నెగడితిగా | ॥ఆంజ॥ |


