అధ్యాత్మ సంకీర్తన
రేకు: 379-2
సంపుటము: 4-460
రేకు: 379-2
సంపుటము: 4-460
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను | ॥పల్లవి॥ |
| హేయములో సుఖము యెంగిలిలో సుఖము కాయము నమ్మికదా కష్టపడెను పాయములో చవులు పాపములో చవులు మాయలు నమ్మికదా మనసూనిట్టాయను | ॥ఎన్న॥ |
| కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను | ॥ఎన్న॥ |
| అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు దొంగజీవుఁడు యిట్లానే తొట్రుపడెను అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను | ॥ఎన్న॥ |


