అధ్యాత్మ సంకీర్తన
రేకు: 379-4
సంపుటము: 4-462
రేకు: 379-4
సంపుటము: 4-462
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఒక్కఁడే యేకాంగవీరుఁ డుర్వికి దైవమౌనా (మైనాఁడు? ) యెక్కడా హనుమంతుని కెదురా లోకము | ॥పల్లవి॥ |
| ముందట నేలేపట్టమునకు బ్రహ్మయినాఁడు అందరు దైత్యులఁ జంపి హరి పేరైనాఁడు అంది రుద్రవీర్యము దానై హరుఁడైనాఁడు యెందు నీ హనుమంతుని కెదురా లోకము | ॥ఒక్క॥ |
| చుక్కలు మోవఁ బెరిగి సూర్యుఁడు దానైనాఁడు చిక్కుఁ బాతాళము దూరి శేషుఁడైనాఁడు గక్కన వాయుజుఁడై జగత్ప్రాణుఁడై నాఁడు యెక్కువ హనుమంతుని కెదురా లోకము | ॥ఒక్క॥ |
| జలధిఁ బుటమెగసి చంద్రుఁడు దానైనాఁడు చెలఁగి మేరువుపొంత సింహమైనాఁడు బలిమి శ్రీ వేంకటేశు బంటై మంగాంబుధి - నిల యీ హనుమంతుని కెదురా లోకము | ॥ఒక్క॥ |


