అధ్యాత్మ సంకీర్తన
రేకు: 380-2
సంపుటము: 4-465
రేకు: 380-2
సంపుటము: 4-465
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| వారిధిశయన వో వటపత్రపరియంక గారవాన మేలుకొని కన్నులు దెరవవే | ॥పల్లవి॥ |
| ఘన యోగి హృదయపు కమలాలు వికసించె వొనర విజ్ఞాన సూర్యోదయమాయ మును జీవ పరమాత్మముల జక్కవలు గూసె వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే | ॥వారిధి॥ |
| కలుషముల నేటి చీఁకట్లెల్లఁ బెడఁబాసె నలువంక వేద కీరనాదము మ్రోసె అలరి యితర ధర్మాల నేటి చుక్కలు మాసె జలజాక్ష మేలుకొని సతి మోము చూడవే | ॥వారిధి॥ |
| కపట రాక్షస నేత్ర కలు హారములు మోడ్చె యిపుడే సుకర్మముల యెండలు గాసె అపురూప శ్రీ వేంకటాద్రీశ మేలుకొని నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గావనవే | ॥వారధి॥ |


