అధ్యాత్మ సంకీర్తన
రేకు: 380-4
సంపుటము: 4-467
రేకు: 380-4
సంపుటము: 4-467
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కలశాపురముకాడ కందువ సేసుకొని అలరుచునున్న పాఁడు హనుమంతరాయఁడు | ॥పల్లవి॥ |
| సహజాన నొక జంగ చాఁచి సముద్రము దాఁటె మహిమ మీరఁగ హనుమంతురాయఁడు యిహమున రాము బంటై యిప్పుడూ నున్నవాఁడు అహరహరమును దొడ్డ హనుమంత రాయఁడు | ॥కల॥ |
| నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె మండిత మూరితి హనుమంత రాయఁడు దండితో మగిడివచ్చి తగ సీత శిరోమణి అండ రఘపతి కిచ్చె హనుమంతరాయఁడు | ॥కల॥ |
| వదలని ప్రతాపాన వాయుదేవు సుతుఁడై మదియించినాఁడు హనుమంత రాయఁడు చెదరక యే పొద్దు శ్రీ వేంకటేశు వాకిట- నదివో కాచుకున్నాఁడు హనుమంత రాయఁడు | ॥కల॥ |


