అధ్యాత్మ సంకీర్తన
రేకు: 381-2
సంపుటము: 4-471
సంస్కృతకీర్తన
రేకు: 381-2
సంపుటము: 4-471
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నమో నమో రఘుకులనాయక దివిజవంద్య నమో నమో శంకరనగజ(జా?)నుతా | ॥పల్లవి॥ |
| విహిత ధర్మపాలక వీర దశరథ రామ గహనవాసినీ తాటకా మర్దన అహల్యా శాపమోచన అసుర కుల భంజన సహజ విశ్వామిత్ర సవన రక్షకా | ॥నమో॥ |
| హరి కోదండహర సీతాంగనా వల్లభ ఖరదూషణారి వాలిగర్వాపహా తరణి తనూజాది తరుచర పాలక శరధి లంఘన కృత సౌమిత్రి సమేతా | ॥నమో॥ |
| బిరుద రావణ శిరో భేదక విభీషణ- వరద సాకేత పుర వాస రాఘవ నిరుపమ శ్రీ వేంకేటనిలయ విజనగర పురవరవిహార పుండరీకాక్షా | ॥నమో॥ |


