అధ్యాత్మ సంకీర్తన
రేకు: 382-3
సంపుటము: 4-478
రేకు: 382-3
సంపుటము: 4-478
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఏదైనా సుఖమే యిన్నిటా నీవు గలవు కాదుగూడదని నిన్నుఁ గక్కసించనేఁటికి | ॥పల్లవి॥ |
| యిహపరములలో నీ వెందు నన్నుఁ బెట్టినాను నిహితమై రెంటిలోనా నీవు గలవు వహి కెక్క నేలినవాఁడెక్కడ నుండుమన్నా తహతహఁ గొలువుకుత్తరువే బంటుకుమ | ॥ఏదై॥ |
| పాప పుణ్యములలో నేపని నన్నుఁ జేయించినా కాపాడి రెండు నీవు కల్పించినవే యేపున మగఁడైన వాఁ డేమి సేయించినాను దాపగుఁ బతివ్రతా ధర్మమే యాలికిని | ॥ఏదై॥ |
| కల్ల నిజములలో నొక్కటి నన్ను నాడించినా చెల్లించ రెంటికి నీవే శ్రీ వేంకటేశా తల్లిదండ్రులే బాస దగ నాడ నేర్పినాను తెల్లమిగ నాడేది తేకువే బిడ్డనికి | ॥ఏదై॥ |


