అధ్యాత్మ సంకీర్తన
రేకు: 382-6
సంపుటము: 4-481
రేకు: 382-6
సంపుటము: 4-481
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| వట్టిజోలి యెంత లేదు వైరాగ్యమే సుఖము నెట్టుకొని వివేకింప నేరవలెఁ గాని | ॥పల్లవి॥ |
| కట్టుకొంటే నెంతైనాఁ గలదు సంసారము పట్టి చేసితేఁ గలవు పనులెన్నైనా చుట్టుకొంటే నూరఁగల చుట్టరికముఁగలదు అట్టె మోక్షము గడించే దరు దింతేకాని | ॥వట్టి॥ |
| చేసేనంటేఁ గలవు సేనా సేన పనులు లాసి తగిలించు కొంటే లంపటా లంటు ఆసలు పెంచ జూచితే నంత కంతకుఁ బెరుగు వేసిరి శాంతిఁబొందుటే వేడు కింతేఁకాని | ॥వట్టి॥ |
| పనిగొంటేఁ బెనుగొనుఁ బంచేంద్రియంబులు వెనుకొంటేఁ జిమ్మిరేఁచు వేడుకలు తనిసి శ్రీ వేంకటేశు దసానుదాసుఁడై కొన కెక్కఁగ నాతనిఁ గొలువవలెఁగాని | ॥వట్టి॥ |


