అధ్యాత్మ సంకీర్తన
రేకు: 383-4
సంపుటము: 4-485
రేకు: 383-4
సంపుటము: 4-485
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఎంతని నుతియింతు రామరామ యిట్టి నీ ప్రతాపము రామరామ పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ | ॥పల్లవి॥ |
| బలుసంజీవనికొండరామరామ బంటుచేఁ దెప్పించితివిరామరామ కొలఁదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ | ॥ఎంత॥ |
| శరణంటే విభీషణుని రామరామ చయ్యనఁగాచితివటరామరామ బిరుదులరావణుని రామరామ పీఁచమడఁచితివట రామరామ ధరలోఁ జక్రవాళము రామరామ దాఁటి వచ్చితివఁట రామరామ సురలు నుతించిరట రామరామ నీచొప్పు యిక నదియెంతో రామరామ | ॥ఎంత॥ |
| సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులుఁ దమ్ములట రామరామ నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ శ్రీమంతుఁడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీఁది రామరామ కామితఫలదుఁడవు రామరామ కౌసల్యానందనుఁడవు రామరామ | ॥ఎంత॥ |


