అధ్యాత్మ సంకీర్తన
రేకు: 383-5
సంపుటము: 4-486
రేకు: 383-5
సంపుటము: 4-486
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| బిరుదు బంటితఁడు పెద్దహనుమంతుడు సిరులతో రామునికి సీతాదేవికిని | ॥పల్లవి॥ |
| మూఁడులోకములుఁ దుదముట్టఁ బెరిగినవాఁడు వాఁడె హనుమంత దేవరఁ జూడరో పోఁడిమి దైత్యుల గెల్చి పూఁచి చేయెత్తుకున్నాఁడు వాఁడి ప్రతాపముతోడ వాయుజుఁడు | ॥బిరుదు॥ |
| ధ్రువమండలము మోవఁ దోఁక యెత్తుకున్నవాఁడు సవరనై పెనుజంగ చాఁచుకున్నాఁడు భువిఁ గవచ కుండలంబులతోఁ బుట్టినవాఁడు వివరించ నేకాంత వీరుఁడైనవాఁడు | ॥బిరుదు॥ |
| పెనచి పండ్లగొల పిడికిలించుకున్నాఁడు ఘనుఁ డిన్నిటా స్వామి కార్యపరుఁడు వినయపు శ్రీ వేంకటవిభునికి హితవరి యెనసి మొక్కఁగదరో యెదుట నున్నాఁడు | ॥బిరుదు॥ |


