అధ్యాత్మ సంకీర్తన
రేకు: 384-4
సంపుటము: 4-490
రేకు: 384-4
సంపుటము: 4-490
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె భువిలోన గలశాపుర హనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| రామ నీ సేవకుఁ డిదె రణరంగ ధీరుఁడు ఆముకొన్న సత్వగల హనుమంతుఁడు దీమసాన లంక సాధించి వుంగరము దెచ్చె కామిత ఫలదుఁడు యీ ఘన హనుమంతుఁడు | ॥అవ॥ |
| జానకీరమణ సప్తజలధులు లంఘించి ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుఁడు పూని చుక్కలెల్లా మొలపూసలుఁగాఁగఁబెరిగి భాను కోటి కాంతితోఁ జొప్పడు హనుమంతుఁడు | ॥అవ॥ |
| యినవంశ శ్రీ వేంకటేశ నీ కరుణతోడ అనుపమ జయశాలి హనుమంతుఁడు పనిపూని ఇటమీఁది బ్రహ్మపట్టమునకు నీ - యనుమతిఁ గాచుకున్నా డదె హనుమంతుఁడు | ॥అవ॥ |


