అధ్యాత్మ సంకీర్తన
రేకు: 384-5
సంపుటము: 4-491
సంస్కృతకీర్తన
రేకు: 384-5
సంపుటము: 4-491
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| దేవదేవోత్తమ తే నమో నమో రావణదమన శ్రీరఘురామా | ॥పల్లవి॥ |
| రవికులాంబుధిసోమ రామ లక్ష్మణాగ్రజ భువి భరత శత్రుఘ్నపూర్వజ సవనపాలక కౌసల్యానందవర్ధన ధవళాబ్జనయన సీతారమణా | ॥దేవ॥ |
| దనుజ సంహారక దశరథ నందన జనక భూపాలక జామాత వినమిత సుగ్రీవ విభీషణసమేత మునిజన వినుత సుముఖ సుచరిత్రా | ॥దేవ॥ |
| అనిలజవరద యహల్యా శాప మోచన సనకాది సేవిత చరణాంబుజ ఘనతర శ్రీ వేంకటగిరి నివాస అనుపమోదార విహార గంభీరా | ॥దేవ॥ |


