అధ్యాత్మ సంకీర్తన
రేకు: 385-1
సంపుటము: 4-492
రేకు: 385-1
సంపుటము: 4-492
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ సులభుఁ డిన్నిటా వీఁడె సుగ్రీవనరహరి | ॥పల్లవి॥ |
| కంబములోనఁ బుట్టి కనకదైత్యునిఁ గొట్టి అంబరపు దేవతల కభయ మిచ్చి పంబి సిరిఁ దన తొడపైఁ బెట్టుక మాటలాడీ అంబుజాక్షుఁ డైనట్టి యాదమ నరహరి | ॥కొలు॥ |
| నానా భూషణము లున్నతి తోడ నిడుకొని పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి మానవులకెల్లను మన్నన చాలా నొసఁగి ఆనందముతో నున్నాడుఁ అదిగో నరహరి | ॥కొలు॥ |
| మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ అక్కజపు మహిమల నలరుచును తక్కక శ్రీ వేంకటాద్రిఁ దావుకొని వరాలిచ్చీ చక్కఁదనముల కెల్లాఁజక్కని నరహరి | ॥కొలు॥ |


