అధ్యాత్మ సంకీర్తన
రేకు: 385-2
సంపుటము: 4-493
రేకు: 385-2
సంపుటము: 4-493
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుటు యీతఁడు రామునిబంటు యీతని సేవించరో | ॥పల్లవి॥ |
| వుదయాస్త నగముల కొకజంగ చాఁచినాఁడు చదివె రవితో సర్వ శాస్త్రములు తుద బ్రహ్మాండము మోవఁ దోఁక మీఁది కెత్తినాఁడు పెద పెద కోరల పెను హనుమంతుఁడు | ॥ఈతని॥ |
| కుడిచేత దనుజులఁ గొట్ట నూఁకించినాఁడు యెడమచేఁ బండ్లగొల పిడికిలించె వుడుమండలము మోవ నున్నతిఁ బెరిగినాఁడు బెడితపు మేనితోడఁ బెనుహనుమంతుఁడు | ॥ఈతని॥ |
| పుట్టుఁ గవచ కుండలంబులతోడ నున్నవాఁడు గట్టి బ్రహ్మపట్టానకుఁ గాచుకున్నాఁడు ఇట్టే శ్రీ వేంకటేశు నెదుటఁ బనులు సేసీ బెట్టిదపు సంతోసానఁ బెనుహనుమంతుఁడు | ॥ఈతని॥ |


