అధ్యాత్మ సంకీర్తన
రేకు: 385-6
సంపుటము: 4-497
రేకు: 385-6
సంపుటము: 4-497
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఔనయ్య జాణఁడవు ప్రహ్లాదవరదా ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరదా | ॥పల్లవి॥ |
| వేసరక శ్రీ సతితో వేడుక నవ్వులు నవ్వి ఆసలు చూపేవు ప్రహ్లాదవరదా సేసవెట్టిన చేతుల చెఱఁగువట్టి తీసేవు ఆ సుద్దులే చెప్పేను ప్రహ్లాదవరదా | ॥ఔన॥ |
| నంటునఁ దొడమీఁదను నలినాక్షి నెక్కించుక అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరదా గెంటక యేపొద్దును కేలుగేలుఁ గీలించుక అంటువాయ వదివో ప్రహ్లాదవరదా | ॥ఔన॥ |
| కందువతోఁ గాఁగిలించి కైవసము సేసుకొంటి - నందముగ నీకెను ప్రహ్లాదవరదా పొంది శ్రీవేంకటమున పొంచి యౌభళములోనా అంది వరాలిచ్చేవు ప్రహ్లాదవరదా | ॥ఔన॥ |


