అధ్యాత్మ సంకీర్తన
రేకు: 386-5
సంపుటము: 4-502
రేకు: 386-5
సంపుటము: 4-502
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఎంత ప్రతాపమువాఁడు యెంతటి నేరుపరి యెంతని పొగడవచ్చు నీ రాముని | ॥పల్లవి॥ |
| వాలి నొక్క కోలనేసి వారిధి గట్టిన వాఁడు తాలిమితో సుగ్రీవుని లాలించినాఁడు పాలించి విభీషణునిఁ బట్టము గట్టిన వాఁడు యేలుమని లంక కెల్లా నీ రాముఁడు | ॥ఎంత॥ |
| కుచ్చి పర మొండెముగా కుంభ కర్ణుఁ గొట్టినాఁడు హెచ్చి రాకాసులఁ జంపె నీ రాముఁడు తచ్చి రావణాసురుని తలలు చెండాడినాఁడు ఇచ్చ కొలఁదుల నిట్టె యీ రాముఁడు | ॥ఎంత॥ |
| సీత తో విమాన మెక్కి చేరి యయోధ్యకు వచ్చి యీతలఁ బట్ట మేలినాఁ డీ రాముఁడు శ్రీ తరుణితోఁగూడి శ్రీ వేంకటేశుఁడైనాఁడు యీతఁడే దరసించరో యీరాముఁడు | ॥ఎంత॥ |


