అధ్యాత్మ సంకీర్తన
రేకు: 387-3
సంపుటము: 4-506
రేకు: 387-3
సంపుటము: 4-506
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో పొంత నిదే కలశాపుర హనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| పిడికిటఁ బట్టినవి పెద్దపండుల గొలలు అడరి యెత్తినది మహావాలము గుడిగొన రాకాసులఁ గొట్టినది వలకేలు పొడచూపీఁ గలశాపుర హనుమంతుఁడు | ॥ఎంత॥ |
| సందడి సమరానకు చాఁచినది పెనుజంగ అందముగ నిక్కించినదదే వురము కుందక వీర రసమే కురిసేటిది మొగము పొందగువాఁడు కలశాపుర హనుమంతుఁడు | ॥ఎంత॥ |
| వుదుటన మెలఁగేవి వొద్దికైన పాదాలు త్రిదశుల మెప్పించేది దివ్యరూపము అదె శ్రీ వేంకటేశు బంటయి నిలుచున్నాఁడు వొదలుచుఁ గళశాపుర హనుమంతుఁడు | ॥ఎంత॥ |


