అధ్యాత్మ సంకీర్తన
రేకు: 387-6
సంపుటము: 4-509
రేకు: 387-6
సంపుటము: 4-509
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| అదె చూడరయ్యా పెద్దహనుమంతుని గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా | ॥పల్లవి॥ |
| వుదయాస్త శైలములు వొక జంగగాఁ జాఁచె అదివో ధ్రువ మండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు యెదుట నీతని మహి మేమని చెప్పేమయ్యా | ॥అదె॥ |
| దండిగా బ్రహ్మాండముదాఁకఁ దోఁక మీఁదికెత్తె మెండగు దిక్కులు నిండ మేను వెంచెను గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె అండనీతని ప్రతాప మరుదరుదయ్యా | ॥అదె॥ |
| దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరిబంటాయ మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా | ॥అదె॥ |


