అధ్యాత్మ సంకీర్తన
రేకు: 388-1
సంపుటము: 4-510
రేకు: 388-1
సంపుటము: 4-510
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| నరులాల మునులాల నానాదేవతలాల పరబ్రహ్మ మీతఁడే ప్రత్యక్షమై వున్నాఁడు | ॥పల్లవి॥ |
| భావించి చూడరో వీఁడె ప్రహ్లాద వరదుఁడు సేవించరో తొడమీఁది శ్రీ సతిని వావిరి నుతించరో వరశంఖచక్రాలవె కోవిదుఁడు గద్దెమీఁదఁ గొలువై వున్నాఁడు | ॥నరు॥ |
| చెలఁగి మొక్కరో వీఁడె శ్రీ నరసింహ దేవుఁడు తెలియరో యీతని తేజోరూపము అలరి పూజించరో అనంతహస్తము లవె కొలఁది మీరి విష్ణుఁడు కొలువై వున్నాఁడు | ॥నరు॥ |
| యిదె శరణనరో హిరణ్యదైత్యహరుని అదన జపించరో యీ హరినామము యెదుట శ్రీ వేంకటాద్రిని యహోబలమునందు కొదలే కాదిమూరితి కొలువై వున్నాఁడు | ॥నరు॥ |


