అధ్యాత్మ సంకీర్తన
రేకు: 388-3
సంపుటము: 4-512
రేకు: 388-3
సంపుటము: 4-512
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| సులభుఁడై వున్నాఁడు సుగ్రీవనారసింహుఁడు నెలకొన్న దాసులకు నిధానము వీఁడే | ॥పల్లవి॥ |
| తుంగభద్రా తటమున తొడపై నిందిర తోడ సింగారించుకొన్నవేల్పుసింహము వీఁడే సంగతిగా దేవతలు జయవెట్టి కొలువఁగా చెంగటనే మహిమలఁ జెలరేఁగీ వీఁడే | ॥సుల॥ |
| చలువ బండలమీఁద చక్కని కొండల దండ అలరీని వీరనరహరి వీఁడె వెలయు శంఖచక్రాల వేవేలు హస్తములతో బలవంతుఁడై వున్నాఁడు పంతముతో వీఁడే | ॥సుల॥ |
| పువ్వులతోఁటలనీడ భువనేశ్వరములోన జవ్వనపు మనుజ కేసరి వీఁడె ఇవ్వల శ్రీ వేంకటాద్రి నిరవై వరములిచ్చి నవ్వుమోముతోడ భువనము లేలీ వీఁడే | ॥సుల॥ |


