అధ్యాత్మ సంకీర్తన
రేకు: 389-1
సంపుటము: 4-514
రేకు: 389-1
సంపుటము: 4-514
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| అదె లంక సాధించె నవనిభారము దించె విదితమై ప్రతాపము వెలయించె నితఁడు | ॥పల్లవి॥ |
| రవి వంశ తిలకుఁడు రాముఁ డితఁడు భువిఁ బుట్టె దశరథ పుత్రుఁ డితఁడు భవుఁడెంచెఁ దారక బ్రహ్మ మీతఁడు పవనజు కిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు | ॥అదె॥ |
| బలువుఁడు సీతాపతి యితఁడు తలకొన్న వాలి మర్దనుఁ డితఁడు విలసిల్లె నేకాంగ వీరుఁ డితఁడు చలమరి కోదండ దీక్షా గురుఁ డితఁడు | ॥అదె॥ |
| శరణాగత వజ్రపంజరుఁ డితఁడు సరిలేని యసుర భంజకుఁ డితఁడు వరదుఁడు శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడు అరయ విజయనగరాధీశుఁ డీతఁడు | ॥అదె॥ |


