అధ్యాత్మ సంకీర్తన
రేకు: 389-2
సంపుటము: 4-515
రేకు: 389-2
సంపుటము: 4-515
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| రాముఁడు లోకాభిరాముఁడు వీఁడిగో వేమారు మొక్కుచు సేవించరో జనులు | ॥పల్లవి॥ |
| చెలువపు రూపమున జితకాముఁడు మలసీ బిరుదున సమర భీముఁడు పొలుపైన సాకేతపుర ధాముఁడు యిలలోఁ బ్రజలకెల్లా హిమధాముఁడు | ॥రాము॥ |
| ఘనకాంతుల నీల మేఘ శ్యాముఁడు అనిశము నుతుల సహస్ర నాముఁడు కనుపట్టు కపి నాయక స్తోముఁడు తనునెంచితే దేవతా సౌర్వభౌముఁడు | ॥రాము॥ |
| సిరుల మించిన తులసీ దాముఁడు కరుణానిధియైన భక్త ప్రేముఁడు వురుతర మహిమల నుద్దాముఁడు గరిమల శ్రీ వేంకటగిరి గ్రాముఁడు | ॥రాము॥ |


