అధ్యాత్మ సంకీర్తన
రేకు: 390-2
సంపుటము: 4-521
రేకు: 390-2
సంపుటము: 4-521
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| జయము జయము ఇఁక జనులాల భయములు వాసెను బ్రదికితి మిపుడు | ॥పల్లవి॥ |
| ఘన నరసింహుఁడు కంభమున వెడలె దనుఁజులు నమసిరి ధర వెలసె పొనిఁగె నధర్మము భూభారమడఁగె మునుల తపము లిమ్ముల నీడేరె | ॥జయము॥ |
| గరిమతో విష్ణుఁడు గద్దెపై నిలిచె హిరణ్య కశిపుని నేపడఁచె అరసి ప్రహ్లాదుని నన్నిటా మన్నించె హరుఁడును బ్రహ్మయు నదె కొలిచేరు | ॥జయము॥ |
| అహోబలేశుఁడు సిరి నంకమున ధరించె బహుగతి శుభములు పాటిల్లె యిహపరము లొసఁగె నిందును నందును విహరించెను శ్రీవేంకటగిరిని | ॥జయము॥ |


