అధ్యాత్మ సంకీర్తన
రేకు: 390-6
సంపుటము: 4-525
రేకు: 390-6
సంపుటము: 4-525
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
| వీఁడివో కలశాపుర వీరహనుమంతుడు వాఁడిమి మెరసినట్టి వజ్రపాణి యితఁడు | ॥పల్లవి॥ |
| చలపట్టి జంగచాఁచి జలధి దాఁటినవాఁడు తల కొన్న రాముని ప్రతాపపువాఁడు యెలమి సీతకుంగరమిచ్చి మెప్పించినవాఁడు కలగుండు వడ లంకఁ గాలిచినవాఁడు | ॥వీడివో॥ |
| మగిడి రాఘవునకు మణి దెచ్చినట్టివాఁడు గగనము మోచిన కాయమువాఁడు మొగి సూర్యునిచే శాస్త్రములు చదివినవాఁడు పగటున మీఁది బ్రహ్మ పట్టమేలే వాఁడు | ॥వీడివో॥ |
| యిప్పుడూఁ బ్రాణముతోనే యిల దేవుఁడైనవాఁడు చెప్పఁగొత్తైనమహిమ జెన్నొందువాఁడు ముప్పిరి శ్రీ వేంకటేశు మూల బలమైన వాఁడు వొప్పగు వరా లిందరి కొసగేటివాఁడు | ॥వీడివో॥ |


