అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 4-1
సంపుటము: 4-532
నిడు రేకు: 4-1
సంపుటము: 4-532
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు | ॥పల్లవి॥ |
| కలికి కావేరి తరగల బాహులతలనే తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు | ॥తొల్లి॥ |
| అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ అదనఁ గమలభవాండమనుతొట్టెల ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు | ॥తొల్లి॥ |
| వేదములె చేరులై వెలయంగ శేషుఁడే పాదుకొను తొట్టెలై పరగఁగాను శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు | ॥తొల్లి॥ |


