అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 13-1
సంపుటము: 4-533
నిడు రేకు: 13-1
సంపుటము: 4-533
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వెరపు దెలుపు నీ వేగిరిమే నీ వెఱిఁగియు నెఱఁగక యేమంటివో | ॥పల్లవి॥ |
| గోరపురుధిరము గురియు గోళ్ళ నీ తోరమైన యా తొడమీఁద గోరంటగోళ్ళ కోమలి నిలువఁగ ఈరసమందక యేమంటివో | ॥వెరపు॥ |
| నెత్తురుఁ బెదవుల నీ మొకమలరఁగ బిత్తరి వీడెపుఁ బెదవులతో మత్తకరిగమన మాటలాడఁగా ఎత్తిన మదమున నేమంటినో | ॥వెరపు॥ |
| ఆననరౌద్రము నట్టహాసమును పూనిన నినుఁగని బొమముడితో లేనగవుల నదలింపెడి సిరితో హీనాధికముల నేమంటివో | ॥వెరపు॥ |
| పెద పెద యూర్పుల పేగుల జందెపు టుదరముతో నీవుండుచును చెదరిన పయ్యెద చెరఁగు జారుసతి యెదురెదురను నీవేమంటివో | ॥వెరపు॥ |
| చింప నెరుల నీ శిరసు ముడుచుకొని కంపముడిగి వేంకటపతివై లంపటమందుచు లక్ష్మీసతితో ఇంపులు నెరపుచు నేమంటివో | ॥వెరపు॥ |


