అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 16-1
సంపుటము: 4-534
నిడు రేకు: 16-1
సంపుటము: 4-534
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అందరి వసమా హరి నెరుఁగ కందువగ నొకఁడుగాని యెరఁగఁడు | ॥పల్లవి॥ |
| లలితపు పది గోట్ల నొకఁడుగాని కలుగఁడు శ్రీ హరిఁ గని మనఁగ ఒలిసి తెలియు పుణ్యుల కోట్లలో ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని | ॥అందరి॥ |
| శ్రుతి చదివిన భూసుర కోట్లలో గతియును హరినె యొకానొకఁడు అతి ఘనులట్టి మహాత్మ కోటిలో తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని | ॥అందరి॥ |
| తుది కెక్కిన నిత్యుల కోట్లలో పొదుగు నొకఁడు తలపున హరిని గుదిగొను హరి భక్తుల కోట్లలో వెదకు నొకఁడు శ్రీ వేంకటపతిని | ॥అందరి॥ |


