అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 16-2
సంపుటము: 4-535
నిడు రేకు: 16-2
సంపుటము: 4-535
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయఁ దలఁచియును రోయఁగ లేరు | ॥పల్లవి॥ |
| మిస మిస మెరువఁగ మెల్లన చేరిరి ముసిఁడిమాని ఫలములు చూచి రసమని సంసారపు బాలికులిదె విసిగి చేఁదుగని విరుగఁగలేరు | ॥వయ॥ |
| బలు విష మొలికెడి పాముఁ బట్టుకొని అలరుచు నలుగడ నాడేరు పొలసి యాసలూర్పులు నిగుడించఁగ తెలిసియు నింకాఁ దెలియఁగలేరు | ॥వయ॥ |
| తేనెదెచ్చి కత్తికి దారఁ బెట్టి(న) నానా విధముల నాఁకేరు దీన తలణఁపెడి తిరు వేంకటపతి చేని పంటలకుఁ జెయి చాఁచలేదు | ॥వయ॥ |


