అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 22-1
సంపుటము: 4-540
నిడు రేకు: 22-1
సంపుటము: 4-540
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చండప్రచండాది జయ విజయులన్ అండఁ బూజించి హరి కటుగదా పూజ | ॥పల్లవి॥ |
| కూర్మ భూమ్యాదులను గోరికఁ బ్రతిష్ఠించి ధర్మముఖ్యంబుల నధర్మాదులన్ కర్మగతిఁ జామర గ్రాహిణులఁ బూజించి మర్మంబుగా హరికి మరికదా పూజ | ॥చండ॥ |
| గరుడ సేనేశులను ఘనుని శేషుని మరియు వరమతులఁ బాదసంహినులను కరమొప్ప శంఖచక్రగదాసి శార్జ్ఞముల అరసి పూజించి హరికిన పుడుగా పూజ | ॥చండ॥ |
| నవకిరీటమును గుండలహార కౌస్తుభము లవిరళపుఁ బీతాంబరాదులలర వివిధగతిఁ బూజించి వేంకటేశ్వరు పూజ యివదఁ దళిగలు పెట్టుఁడిదిగదా పూజ | ॥చండ॥ |


